బీజేపీ పార్టీకి బిగ్ షాక్

బీఆర్ఎస్ పార్టీ లో చేరిన 100 మంది బీజేపీ నాయకులు

గులాబీ కండువా తో స్వాగతం పలికిన ఎమ్మెల్యే  గణేష్ బిగాల
నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో ఎల్లమ్మగుట్ట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్ కాలనీ, అర్సపల్లి చెందిన 100 మంది బీజేపీ నాయకులు,బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటాము. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ నిజామాబాద్ నగరం లో జరిగిన అభివృద్ధి-సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి బి.ఆర్.ఎస్ పార్టీకి గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు నిర్ధేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ లో చేరిన వారు లక్ష్మణ్ 14వ డివిజన్ బీజేపీ నాయకులు,ప్రకాష్ 14వ డివిజన్ బీజేపీ నాయకులు,బాబు రావు 14వ డివిజన్ బీజేపీ నాయకులు, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ ,నుడ మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,బి.ఆర్.ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్,సూదం రవి చందర్, సిర్ప రాజు,మురళి,మతీన్, మీర్ ముంతాజ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love