మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్

Big shock for BRS in Manthani constituency– రాజీనామా చేసిన చల్లా నారాయణ రెడ్డి
నవతెలంగాణ మల్హర్ 
మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బిఅర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017లో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు. కాటారం మండల జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా ఉండి పార్టీలో చేరినప్పటి నుండి నేటి వరకు బీఆర్ఎస్ పార్టీ కోసం అంకిత భావంతో, చిత్తశుద్ధితో పని చేశానని, కానీ నా అనుభవాన్ని, సుదీర్ఘ 40 ఏండ్ల రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకొని అయిన నాకు పార్టీ సముచిత స్థానం కల్పించలేకపోయినందుకు చాలా బాధపడుతున్నట్లుగా చెప్పారు.2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో 5మండలాలు కాంగ్రెస్ పార్టీకీ కంచు కోట అయిన కాటారం మండలంలో బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ నేను నా బుజాల స్కందాల మీద వేసుకొని గెలిపించాను. భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి 5మండలాలో ఒక్కటి అంటే ఒక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా గెలవలేదు కానీ నాకు అప్పగించిన బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో బీఆర్ఎస్ పార్టీ లేని మండలంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేశమన్నారు. జడ్పీటీసీని భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గా మీరు నియమించి .2018 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా తర్వాత 2019లో కమాన్ పూర్ జడ్పీటీసీ గా టికెట్ ఇచ్చిన తర్వాత పూర్తి నిబద్దతతో పని చేసి గెలవని సీట్ ని నా పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తిగా అక్కడ మీరు నిలబెట్టిన అభ్యర్థని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాను. దాని తర్వాత వచ్చిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పని చేసి మంథని మున్సిపాలిటీలో పార్టీ జెండా ఎగురవేసిన కనీసం గుర్తింపు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే 2023 ఎలక్షన్స్ గాను మంథని నియోజకవర్గ టికెట్ కేటాయించిన తీరు నన్ను మరియు మంథని ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది. మంథని నియోజకవర్గంలో అడుగు భూమి లేని ఓ ప్రజాప్రతినిధి ఈ రోజు వందల ఎకరాలు, వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి, నడి రోడ్డు మీద వామన్ రావు లాయర్ దంపతులను హత్య చేపించి, ఒక దళిత యువకుడి మర్మాంగాలను కోసి చంపించి, ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో బెదిరిస్తూ కార్యకర్తలను బానిసలుగా చూస్తూ, ప్రజా ప్రతినిధులను బెదిరిస్తూ, మానసిక క్షోభకీ గురి చేస్తూ, ఇసుక మాఫియా, భూకబ్జాలు చేస్తూ, డబ్బు పవర్ ఉంటే ఎన్ని హత్యలు చేసిన, అరాచకాలు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవచ్చు అనీ, నాకు ఎదురు ఎవరు లేరు అనీ నియంత పాలన చేస్తున్న వారిని కనీస చర్యలు తీసుకోకుండా మళ్ళీ కీలక ఎమ్మెల్యే టికెట్ బాధ్యతలు అప్పగించి ప్రోత్సహించడం, నన్ను మరియు మంథని నియోజకవర్గ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

Spread the love