తెలంగాణలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ కేవలం ఒకే స్థానానికి పరిమితం కావచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేస్తోంది. ఇదే సమయంలో గత లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు పొందిన బీజేపీ ఈసారి 7 చోట్ల గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్ రిజల్ట్ వెల్లడించింది. హైదరాబాద్ స్థానంలో అసదుద్దీన్ గెలుస్తారని అంచనా వేస్తోంది.

Spread the love