నవతెలంగాణ – హైదరాబాద్: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, ‘ఇండియా’ కూటమికి భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, ‘ఇండియా’ కూటమితో పొత్తు ఉండదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. తాము బెంగాల్లో 42 ఎంపీ సీట్లలో ఒంటరిగానే బీజేపీని ఓడించగలమని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ యాత్ర తమ రాష్ట్రం నుంచి వెళ్లాల్సి ఉన్నా.. తమకు సమాచారం ఇవ్వలేదన్నారు.