సుప్రీంకోర్టులో స్పైస్‌జెట్ ఎండీకి భారీ షాక్‌!

నవతెలంగాణ – హైదరాబాద్: విమాన సంస్థ స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. క్రెడిట్ సూయిస్ ధిక్కార కేసుపై నాలుగు వారాల్లోగా స్పందించాలని అజయ్‌ సింగ్‌ను అత్యున్నత న్యాయస్థానం కోరంది. అజయ్ సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారన్న క్రెడిట్ సూయిస్ అరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇరుపక్షాల మధ్య జరిగిన సెటిల్మెంట్ ప్రకారం 3.9 మిలియన్ల డాలర్ల బకాయిలు చెల్లించడంలో విఫలమైనందుకు సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ మార్చిలో సుప్రీంను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజా సమన్లు జారీ అయ్యాయి.

Spread the love