నవతెలంగాణ – హైదరాబాద్: డయాబెటిస్, బీపీ సహా 54 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. మధుమేహం రోగులు అధికంగా వినియోగించే మెట్ ఫార్మిన్, లినాగ్లిప్టిన్, సిటాగ్లిప్టిన్ రేట్లను టాబ్లెట్ కు రూ. 15 నుంచి రూ. 20కు పెంచింది. బీపీకి వినియోగించే టెల్మీసార్టన్, క్లోర్థాలిడన్ మందుల ధరను రూ. 7.14గా సవరించింది. యాంటీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్ సిప్రోఫ్లోక్సాసిన్, కాల్షియం, విటమిన్ డీ3 పిల్స్ రేట్లు సైతం పెరిగాయి. ఇది ఇలా ఉండగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో… అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ప్రజల అవసరం పార్టీలకు లేకపోవడంతో ధరలు విపరీతంగా పెంచుతున్నారని వామపక్షాలు ఫైర్ అవుతున్నాయి.