నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌లోకి భారీగా ఆ పార్టీ ఎమ్మెల్సీలు చేరారు. ఆరుగురు ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, సారయ్య, దండె విఠల్, ఎం.ఎస్. ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే.. ఆయన నివాసంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. ఇటీవల శాసనసభ మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే