టీమిండియాకి బిగ్ షాక్.. స్టార్ ఆటగాడికి గాయం?

నవతెలంగాణ – హైదరాబాద్: వరల్డ్ కప్ 2023లో నేడు (ఆదివారం) అత్యంత రసవత్తరమైన పోరుకు తెరలేవబోతోంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఆతిథ్య భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌ కోసం ఇటు భారత్ ఫ్యాన్స్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌తో పూర్తి సామర్థ్యంతో బరిలోకి భావించిన భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయం కారణంగా న్యూజిలాండ్ మ్యాచ్‌కు దూరం కానుండడం ఇప్పటికే ఖరారైంది. తాజాగా మరో స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూగా గాయపడ్డట్టు తెలుస్తోంది. నెట్స్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అతడు గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో త్రోడౌన్ స్పెషలిస్ట్‌ విసిరిన బంతి సూర్య మణికట్టుకు తగిలింది. బలంగా తగలడంతో తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. దీంతో సెషన్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. హార్ధిక్ పాండ్యా జట్టుకు దూరమైన నేపథ్యంతో ఫినిషర్‌గా సూర్యకుమార్ యాదవ్‌కు చోటు లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో అతడు గాయంపాలవ్వడం జట్టును కలవరపరిచే అంశంగా పరిగణించాలి.

Spread the love