నవతెలంగాణ-హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్ రతిక రోజ్ తండ్రి రాములు మృతిచెందారు. శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. విషయం తెలిసిన ప్రభుత్వ, విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి రతిక కుటుంబాన్ని పరామర్శించి, రాములు మృతదేహానికి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాములుతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రాములు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, రతిక తండ్రి రాములు రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం జనగాం గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు.