నవతెలంగాణ-హైదరాబాద్ : ఉల్టా పుల్టా అంటూ షురూ అయిన బిగ్‌బాస్ సీజన్-7 రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఆదివారం రెండో ఎలిమినేషన్ జరిగింది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో ఈ సీజన్ నుంచి నటి షకీలా ఎలిమినేట్ అయ్యారు. రెండో వారం నామినేషన్స్‌లో శివాజీ, పల్లవి ప్రశాంత్, షకీలా, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, శోభ, అమర్‌దీప్, రతికా రోజ్‌లు ఉండగా, మాయాస్త్రను సాధించిన శివాజీ సేఫ్ అయ్యారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో చివరి వరకూ నామినేషన్స్‌లో టేస్టీ తేజ, షకీలా ఉండగా, చివరికి టేస్టీ తేజ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. షకీలా ఎలిమినేట్ అనగానే, హౌస్‌మేట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు. అనంతరం వేదికపైకి వచ్చి నాగార్జునతో మాట్లాడుతూ.. ‘ఇంత త్వరగా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తానని అనుకోలేదు’ అంటూ షకీలా ఎమోషనల్ అయ్యారు. నాగ్.. షకీలా బిగ్ బాస్ జర్నీ చూపించినప్పుడు ఆమె కంటతడి పెట్టారు. అనంతరం హౌస్‌మేట్స్‌లో ఎవరెవరు ఎలాంటి వారో చెప్పమని రెయిన్‌బో కలర్స్‌ను ఇవ్వగా షకీలా ఆ వ్యక్తి ఫొటోపై పెయింట్ వేస్తూ, వాళ్ల మనస్తత్వాన్ని చెప్పారు. ‘‘ప్రియాంక.. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్రిన్స్ యావర్.. ఎప్పుడూ తానే గొప్పవాడు అనుకుంటాడు. పల్లవి ప్రశాంత్.. ఆవేశ పరుడు. ఎవరి మాట వినడు. తొందర పడిపోతాడు. దామిని.. నమ్మకస్తురాలు. రతికా రోజ్.. హృదయం బండరాయిలాంటిది. శివాజీ.. ఇంట్లో వాళ్లందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు’ అంటూ షకీలా హౌస్‌మేట్స్‌కు కితాబిచ్చారు. ఇక బిగ్ బాస్ బజ్ లో షకీలా హౌస్ మెట్స్ గురించి షాకింగ్ కామెట్స్ చేసింది. ఒక్కోక్కరి గురించి చెప్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వచ్చినప్పుడు ఇప్పడికి ప్రశాంత్ ఎలా చేంజ్ అయ్యాడో వివరించింది. కాగా ఈ ప్రోమో వైరల్ అవుతుంది.