మోడీని కలవనున్న బీహార్ సీఎం

నవతెలంగాణ – ఢిల్లీ: బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ సమావేశంలో బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ  ఇవ్వాలని ప్రధాని మోడీని నితీశ్‌ డిమాండ్‌ చేసే అవకాశం ఉందని జేడీయూ వర్గాలు తెలిపాయి.  ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన అంశాలు కూడా బీజేపీ అగ్రనేతలతో సీఎం నితీశ్‌ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Spread the love