పాముకాటుతో బీహార్ హమాలి మృతి..

నవతెలంగాణ – నవీపేట్: పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ శివారు నీలకంఠ ట్రేడర్స్ రైస్ మిల్ నందు హమాలీగా పనిచేస్తున్న రంజన్ కుమార్ (45) పాముకాటుతో ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రం, ఖగారియా జిల్లా, పిప్పర్ పంతి గ్రామానికి చెందిన రంజన్ కుమార్ భార్యతో కలిసి పది రోజులుగా రైస్ మిల్లులో హమాలీ పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం 3 గంటలకు నిద్ర పోతున్న సమయంలో వీపుపై పాము కాటు వేయడంతో గమనించిన భార్య తోటి హమాలీల సాయంతో పామును చంపివేసి చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందడంతో భార్య కిరణ్ దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.

Spread the love