ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ముగ్గురి మృతి

నవతెలంగాణ – తుని: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొండంగి మండలం కొత్త ముసలయ్యపేట వద్ద ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఘటనాస్థలంలోనే ఇద్దరు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతులను యు.కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామస్థులుగా గుర్తించారు. ఒంటిమామిడి నుంచి శ్రీరాంపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Spread the love