నవతెలంగాణ – మెదక్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. జనతా హోటల్ సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన బాల్గరి భాస్కర్(22)గా గుర్తించారు. గాయపడిన యువకుడిని శభాష్‌పల్లికి చెందిన పానగరి నరేశ్ అని పోలీసులు పేర్కొన్నారు.