జన సంపర్క్ అభియాన్ గుర్తుగా మేడారంలో బైక్ ర్యాలీ

– బీజేవైఎం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మాదరి శ్రీకాంత్
నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని మేడారం వనదేవతల సన్నిధిలో మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బీజేవైఎం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో బిజెపి, బిజెవైఎం శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మొదట వనదేవతలను దర్శించుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి ఎం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ..  బిజెపి ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో భారత క్రీడా విధానంలో చాలా మార్పులు చేసిందని మరియు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన చేసేలా క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసిందన్నారు. బిజెపి ప్రభుత్వం యొక్క కూర్పు, బలం మరియు మోడి ప్రభుత్వం చేసిన పనుల వల్ల సాధారణ ప్రజలకు ఎన్ని ప్రయోజనాలు పొందారనే అనేపై చర్చించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల ప్రస్థానానికి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డులను దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love