కాంట్రాక్ట్ అధ్యాపకుల బైక్ ర్యాలీ..

నవతెలంగాణ-డిచ్ పల్లి :  రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలో  జాక్ పిలుపు లో భాగంగా సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ముందు ప్రారంభమై వయా లా కాలేజ్, కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుండి మెయిన్ గేట్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టు ఉపాధ్యాయులు పాల్గొని  వినూత్నంగా తాము నిరసనను తెలుపుతు బైక్ ర్యాలీతో చేపట్టారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ స్వామి రావు మాట్లాడుతూ రాష్ట్రంలో యూనివర్సిటీలలో బైక్ ర్యాలీని జాక్ పిలుపు మేరకు ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉపాధ్యాయులు 1335 మందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డాక్టర్ స్వామి రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  కాంట్రాక్టు ఉపాధ్యాయులు డాక్టర్ శరత్, డాక్టర్ గోపిరాజ్, డాక్టర్ బి.ఆర్ నేత, డాక్టర్ కిరణ్ రాథోడ్ ,డాక్టర్ రామేశ్వర్ రెడ్డి, డాక్టర్ గంగ కిషన్, డాక్టర్ డానియల్, డాక్టర్ సురేష్, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ దేవరాజ్ శ్రీనివాస్, డాక్టర్ జలంధర్, సందీప్, రాజేశ్వర్ ,పురుషోత్తం, డాక్టర్ నర్సయ్య, డాక్టర్ ఆనంద్, డాక్టర్ నరసింహులు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ బి శ్రీనివాస్, డాక్టర్ జి శ్రీనివాస్ తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మంత్రి ని కలిసిన జాక్ ప్రతినిధులు..
ప్రొఫెసర్ పరశురాం అధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లో ఉన్నత విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సాధ్యమైనంత మెరకు త్వరలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ని స్పీడ్ అప్ చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఉస్మానియా జాక్ చైర్మన్ తోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ఉన్న ప్రతినిధులు పాల్గొన్నారు.
Spread the love