– అప్పుల్లో కురుక్కపోయినా ఇండ్ల నిర్మాణాల లబ్ధిదారులు
నవతెలంగాణ- మద్నూర్:
మద్నూర్ మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల లబ్ధిదారులకు బిల్లులు కరువయ్యాయి ఇండ్లు మంజూరు చేశారు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు మొదటి బిల్లు లేదు రెండో బిల్లు లేదు మూడో బిల్లు లేదు ఇదిగో బిల్లులు వస్తాయి. అదిగో బిల్లులు వస్తాయి అంటూ ఆశలు తప్ప బిల్లులు అందక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు అప్పుల్లో కురుక్కుపోయారు. అర్హులైన ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని కెసిఆర్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ ఉమ్మడి మండలంలో దాదాపు 235 ఇండ్లు మంజూరు కాగా లబ్ధిదారులు ఇండ్ల మంజూరు కోసం 7200 చొప్పున చెల్లించి ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది మొదటి బిల్లు ఇంటి బేస్మెంట్ పూర్తి కాగానే ఇవ్వాలి అది రాలేదు. రెండో బిల్లు స్లాబ్ లేవల్ వరకు ఇంటి నిర్మాణానికి బిల్లు చెల్లించాలి అది కూడా రాలేదు మూడవది ఇంటి గిలావు పూర్తి కాగానే చెల్లించాలి అది కూడా రాలేదు కొంతమంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు పూర్తిచేసి ఇంటికి కలరింగ్ వేసుకొని కొత్త ఇంట్లోకి వెళ్లిన ఏ ఒక్క బిల్లులు అందక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ప్రభుత్వ తీరుపై లబోదిబో అంటున్నారు ఇల్లు కట్టుకున్న వాటికి సంబంధిత శాఖ అధికారులు ఎంబి రికార్డులు చేసి ఉన్నతాధికారులకు అందజేసిన వాటి బిల్లులు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం డబుల్ బెడ్ రూమ్ ఆశతో ఇల్లు నిర్మించుకున్న వారు అప్పుల్లో కురుక్కుపోయారు మద్నూర్ ఉమ్మడి మండలంలో ఒక్కొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఐదు ఆరు ఇండ్లు మంజూరు చేయగా లబ్ధిదారులు వాటిని నిర్మాణాలు చేపట్టగా ఇంతవరకు ఏ ఒక్క బిల్లు రాకపోవడం బిల్లులు కరువుతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల లబ్ధిదారులు అప్పుల బాధతో లబోదిబోమంటున్నారు ఇండ్ల నిర్మాణాలు జరిగి దాదాపు పది నెలలు గడుస్తున్నా బిల్లులు కరువయ్యాయి బిల్లులు రాబట్టడానికి అధికారులు ఎన్నికల కోడ్ సాకుగా చూపిస్తున్నారు ఎన్నికలు జరగాలంటే రెండు నెలల సమయం పడుతుంది. ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కానీ డబుల్ బెడ్ రూములు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు ఎలా వస్తాయో ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. ఐదు లక్షల ఆశతో ఇల్లు నిర్మించుకుంటే 10 లక్షల అప్పుతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు ప్రస్తుతం కెసిఆర్ ప్రభుత్వం బిల్లులు చెల్లించే పరిస్థితులు లేదు ఎందుకంటే ఎన్నికల కోడ్ రాకమునుపే ఇండ్ల నిర్మాణాల బిల్లుల గురించి పట్టించుకునే నాధుడే లేక లబ్ధిదారులు అయోమయంలో పడగా ప్రస్తుతం ఎన్నికల కోడ్ వచ్చేసింది బిల్లులు ఎవరికి అడగాలి అడిగిన అధికారి ఎన్నికల కోడ్ అనే సమాధానం రావడం అసలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు వచ్చేనా అనే ఆందోళనలో లబ్ధిదారులంతా అయోమయంలో పడ్డారు దాదాపు సంవత్సరం కాలంగా ఇండ్ల నిర్మాణం పనులు కొనసాగిస్తూ పూర్తి చేసుకున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లులు వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు