ఎమ్మెల్సీ కవితను కలిసిన బినోల సొసైటీ చైర్మన్ ..

Binola Society Chairman who met MLC Kavitha..నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాన్లు కుటుంబ సమేతంగా తన ఎమ్మెల్సీ కవితను హైదరాబాదులోని ఆమె నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా తన పుట్టినరోజు సందర్భంగా తన అభిమాన నాయకురాలు తన రాజకీయ జీవితానికి పునాది వేసిన ఎమ్మెల్సీ కవితను కలవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. జీవితాంతం ఆమె అడుగుజాడల్లోనే నడుస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం తిరుమల ప్రసాదాన్ని ఆమెకు అందించారు.
Spread the love