వెలుగులు చిమ్మే పక్షుల గానం,
వెలుగు చూపే జీవ సంరక్షణం?
పుట్టగానే పైకెగిరే పతంగం,
మనకు పాఠం నేర్పే సహజ గుణం?
ఆహారం కొరకు, ఆకాశంలో ఎగిరి,
కదలికలతో జీవన కౌశలం చూపుతాయి?
వాటి సంరక్షణ ప్రకతి జీవన పరమార్ధం,
పక్షుల సంరక్షణ మన ధర్మం!
తల్లి పక్షి కష్టపడి కూడు తెచ్చి,
తన పిల్లలకు ప్రేమను పంచుతుంది?
మనిషి తలచాలి పక్షుల మహత్వం,
సమతుల జీవితం కోసం సాయం చేయాలి!
పక్షులు జంతుశాస్త్రంలో అనిమలియా రాజ్యం, కార్డేటా వర్గం, ఎవ్స్ అనే తరగతికి చెందినవి. భారత దేశంలో పక్షులు అనగానే మనకు శ్రీ సలీం హ్యాలి పేరు మనకు గుర్తుకు వస్తుంది. ఇతను పక్షి శస్త్రానికి అనేక సేవలందించాడు. ఆయన సేవలు చిరస్మరణీయమైనవి. పక్షులు మన జీవనంలో విశిష్టమైన స్థానం కలిగి ఉన్నాయి. అవి కేవలం ప్రకతి అందాలకు ప్రతీకలు మాత్రమే కాకుండా, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి ఒక్కో దేశ సంస్కతి, ప్రకతి, పర్యావరణ విలువలను ప్రతిబింబిస్తాయి. ఈ పక్షుల గొప్పతనాన్ని గుర్తుచేసుకునే రోజు జనవరి 5. దీనిని మన దేశంలో జాతీయ పక్షుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
జీవనంలో పక్షుల పాత్ర
పక్షులు ప్రకతి అందానికి ప్రతీకలు. అవి మన సంస్కతి, పురాణాలు, కవిత్వం, చిత్రకళ మొదలైన అనేక రంగాల్లో ప్రేరణగా నిలుస్తున్నాయి. కొన్ని పక్షులు మనసుకు హాయినిచ్చే గానం చేస్తాయి, మరికొన్ని రకాల పక్షులు ప్రకతిలో చలనం తీసుకువస్తాయి. జాతీయ పక్షులు, ఉదాహరణకు, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే నెమలి, అమెరికాలోని బాల్డ్ ఈగిల్ వంటి పక్షులు తమ దేశాల గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. పక్షులు మనకు సీజనల్ మార్పులను సూచిస్తాయి. వలస పక్షులు రుతువుల మార్పును తెలియజేస్తాయి. కొన్ని పక్షులు వ్యవసాయంలో సహాయకులు, మరికొన్ని ప్రకతి వ్యవస్థకు కీలకమవుతాయి.
పక్షుల సంరక్షణ ఉద్దేశ్యాలు
పక్షుల సంరక్షణ అనేది ప్రకతి రక్షణలో ముఖ్యమైన భాగం. పక్షుల సంఖ్య తగ్గిపోవడం పర్యావరణ సమతుల్యతకు ప్రమాదం. పక్షుల సంరక్షణ లక్ష్యం వాటి జీవన ప్రదేశాలను కాపాడటం, అవి ఎదుర్కొం టున్న ప్రమాదాలను తగ్గించడం, వాటి సంతతిని కొనసాగించడమే.
వ్యవసాయ క్షేత్రంలో పక్షుల పాత్ర
పక్షులు వ్యవసాయంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. కొన్ని పక్షులు పూల పంటలకు పరాగసంపర్కం చేస్తాయి,. ఇది పంట దిగుబడిని పెంచుతుంది. గుళ్లపిట్టలు, కాకులు వంటి పక్షులు వ్యర్థాలను తొలగించి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి. గద్దలు, కొంగలు వంటి పక్షులు తేలికపాటి పంటలను తినే పురుగులను నియంత్రిస్తాయి.
సెల్ టవర్ కిరణాల ప్రభావం
ఆధునిక యుగంలో, సెల్ టవర్ల విస్తరణ పక్షుల జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. సెల్ టవర్ నుండి వచ్చే ఎలక్ట్రో మాగెటిక్ కిరణాలు పక్షుల నావిగేషన్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అవి రుతు మార్పుల సమయంలో పక్షుల వలస మార్గాలను దారితప్పేలా చేస్తాయి. ముఖ్యంగా, చిన్న పక్షులు ఈ కిరణాలకు అత్యంత సున్నితంగా స్పందిస్తాయి. ఈ ప్రభావంతో పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.
మన బాధ్యత
పక్షుల రక్షణ మన కర్తవ్యం. పక్షులకు సహజ జీవన ప్రదేశాలను కల్పించడం, కత్రిమ రసాయనాల వాడకాన్ని తగ్గించడం, సెల్ టవర్ల నిర్మాణాన్ని నియంత్రించడం వంటి చర్యల ద్వారా పక్షులను కాపాడవచ్చు. పక్షుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం, పక్షి ప్రేమికుల సంఘాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు పక్షుల సంరక్షణకు సహాయపడతాయి.
జాతీయ పక్షులు మన దేశానికి గౌరవాన్ని తెస్తాయి. అవి కేవలం అందమైన జీవులే కాదు, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ముఖ్యమైన భాగస్వాములు. మన బాధ్యత పక్షులను కాపాడడం, వాటి కోసం ఆహార ప్రదేశాలు మరియు నివాస ప్రదేశాలు కల్పించడం. పక్షులను కాపాడడం ద్వారా, మనం మన ప్రకతిని, పర్యావరణాన్ని, భవిష్యత్తు తరాలకు అందించే ఆస్తిని రక్షిస్తున్నాం.
గూటిని కాపాడి, ఆహారాన్ని అందించి,
వాటికి మనం చేయాలి సహాయం?
ప్రతి రోజు పక్షుల రక్షణకు ప్రమాణం,
ఇది మనం తీసుకోవలసిన నిర్ణయం?
ప్రకతి తల్లి నడుమ పక్షుల గీతం,
జీవిత రాగాల సరిగమం?
పక్షుల సంరక్షణ మన ధర్మం,
వాటితోనే ఉంటుంది ప్రకతి మహత్తం!
– కమలహాసన్ తుమ్మ
9505618252
జీవశాస్త్ర విషయ నిపుణులు
గౌతమ్ మోడల్ స్కూల్స్ – హైదరాబాద్