తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల సలహా కమిటీ మెంబర్ గా బీర్ల ఐలయ్య

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్ : హైదరాబాద్ అసెంబ్లీ గురువారం, అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రభుత్వం విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యని తెలంగాణ శాసన సభ వ్యవహారల సలహా కమిటీ మెంబర్ గా నియమించారు. వీరితో పాటు చైర్మన్ గా గడ్డం ప్రసాద్ మిగతా తొమ్మిది మందిని శాసన సభ వ్యవహారల సలహా కమిటీ సభ్యులుగా నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబుని, పొన్నం ప్రభాకర్ ని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని, కడియం శ్రీహరిని, అక్బరుద్దీన్ ఓవైసీని, కునమనేని సాంబశివ రావ్ లను సభ్యులుగా నియమించారు. ఇందుకు గాను బీర్ల ఐలయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love