యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామంలో జేపీఆర్ లైట్ వెయిట్ ఇటుకల తయారీ కంపెనీని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ యజమానులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘన స్వాగతం పలికారు. కంపెనీని ప్రారంభించిన తర్వాత కంపెనీలో ఇటుకల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి మధుసూదన్ రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ నాయక్ ఎంపీటీసీ మోహన్ బాబు నాయక్ నాయకులు భాస్కర్ నాయక్ కొమిరిశెట్టి నరసింహులు మండల నాయకులు పాల్గొన్నారు.