మంత్రి పోన్నం ప్రబాకర్ ను విమర్శిస్తే సహించేది లేదు: బీర్ల ఐలయ్య

– బీజేపీనాయకులకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హెచ్చరిక
నవతెలంగాణ – యాదగిరి గుట్ట
విద్యార్థి రాజకీయాల నుండి వచ్చి తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాడిన బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ ను విమర్శిస్తే సహించమని ఇలాగే వ్యవహరిస్తే బీజేపీ నాయకులు తగిన మూల్యం చేల్లించక తప్పదని ప్రభుత్వ విప్ ఆలేర్ ఏంఏల్ ఏ బీర్ల ఐలయ్య హెచ్చరించారు. పోన్నం పై బీజేపీ విమర్శలను ఖండిస్తు బుదవారం గుట్ట లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి ప్రతి గ్రామంలో అందరికీ ఉపాధి కల్పించింది కాంగ్రేస్ పార్టి అన్నారు. అన్ని రాష్ట్రాలలో కులగణనకు ఆమోదం తెలిపడం తో పాటు, ఐదు గ్యారంటీలు, 25 న్యాయాలతో మేనిఫెస్టో ప్రకటించి అన్ని వర్గాలకు సమన్యాయం చేసేది కాంగ్రెస్ అన్నారు. జన్ ధన్ ఖాతాలలో ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు వేస్తా అని మోసం చేసిన పార్టీ బీజేపీ అని విమర్శించారు. దేశాన్ని కార్పోరేట్ శక్తులకు తాకట్టు పెట్టి అదాని,అంబానీలకు ఊడిగం చేస్తున్నది మోడి అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని యువతను మోసం చేసిన పార్టీ బిజేపి అని అటువంటి పార్టి కి చెందిన నాయకులు ఇంకోసారి బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశం లో కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్, ముఖ్యర్ల మల్లేష్, ఏరుకల హెమెందర్, బందారపు బిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.
Spread the love