మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ కమ్మర్ పల్లి: మాజీ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల, కార్యకర్తల, ప్రజల తరఫున  ఈరవత్రి అనిల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, బుజ్జి మల్లయ్య, ఉట్నూర్ ప్రదీప్, సుంకేట శ్రీనివాస్, సింగిరెడ్డి శేఖర్, సాయికుమార్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love