ఘనంగా చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ – మీర్ పేట్ : చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడుగడ్డం రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జిల్లా నలుమూల నుంచి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రంజిత్ రెడ్డి అభిమానులు వేలాదిగా తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేకంగా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు, మహేశ్వరం మండలాలు, తుక్కుగూడ, జలపల్లి మున్సిపాలిటీలు, మీర్ పేట్, బడంగ్ పేట్ కార్పొరేషన్లు, ఆర్కే పురం సరూర్నగర్ డివిజన్లో నుంచి పెద్ద ఎత్తున అభిమానులు నాయకులు, మహిళలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి గజమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద పిల్లలకు చదువుల కోసం చెక్కులను, 50మంది పేదలకు సరుకులు, రూ 2,50,000 విలువ చేసే మందులను రంజిత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ మాజీ ఎంపీటీసీ చలువాది రాజేష్, దేరంగులా యాదయ్య, బొబ్బిలి కిరణ్ గౌడ్, కొండల్ యాదవ్, మహ్మద్ గౌస్, తుక్కుగుడా వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, హనుమంత్ నాయక్, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love