నవతెలంగాణ – అమరావతి: రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, విద్య, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు (జనవరి 23) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. లోకేశ్ జన్మదిన వేడుకలను మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఏపీ మైనార్టీ కార్పొరేషన్ సలహాదారు ఎం.ఏ.షరీఫ్ ల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్, వర్ల రామయ్య కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. తమ ప్రియతమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.