నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దాసరి ప్రకాష్51వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ ఎంపీటీసీల ఫోర రాష్ట్ర కార్యదర్శి పెరుమాండ్ల గుట్టయ్య మాల మహానాడు జాతీయ కార్యదర్శి అసోద భాస్కర్ జేఏసీ మండల నాయకుడు మాజీ వార్డు సభ్యుడు మాదర్ ప్రశాంత్ తెలిపారు మండల కేంద్రంలో దాసరి ప్రకాష్ జన్మదిన వేడుకలను వివిధ పార్టీ నాయకులు సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దాసరి ప్రకాష్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పాల్గొని జిల్లాస్థాయి మండల స్థాయి ఉద్యమ కార్యక్రమంలో నాయకత్వం వహించి అనేక కార్యక్రమాలు నిర్వహించరని అన్నారు.దాసరి ప్రకాష్ సామాజిక సంఘాలలో పనిచేసి అనేక మంది బడుగు బలహీన వర్గాలకు అనేక సేవలను అందించారని తెలిపారు. అనంతరం వృద్ధులకు పేదలకు అంలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చేర్మెన్ జిలకర యాలాద్రి, కాంగ్రేస్ యూత్ జిల్లా నాయకులు మద్ది రాజేష్, నాయకులు మాదరి ప్రశాంత్, తుళ్ళ వివేక్, సిఎం రేవంత్ సైన్యం జిల్లా అధ్యక్షులు గడ్డమిది వేణు, కాంగ్రెస్ యూత్ నాయకులు శ్రీకాంత్, గొల్లపల్లి విజయ్ బాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.