నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరి ఆల్ఫా హోటల్‌లో పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు ఫుడ్ టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో తేలింది. పాడైపోయిన మటన్‌తో బిర్యానీ వండి ఫ్రిజ్‌లో పెడుతున్నారని, కస్టమర్లు రాగానే వేడి చేసి ఇస్తున్నారని అధికారులు తెలిపారు. కిచెన్‌లో దారుణమైన వాసన వస్తోందని, నాణ్యతాప్రమాణాలు ఏమాత్రం లేవని వెల్లడించారు. కేసు నమోదు చేసి రూ.లక్ష ఫైన్ విధించినట్లు పేర్కొన్నారు.