నవతెలంగాణ-హైదరాబాద్ : మినరల్ వాటర్, సోడా వ్యాపారంలో పేరుగాంచిన బిస్లరీ సంస్థ సాఫ్ట్ డ్రింక్స్ రంగంలోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. మూడు ఫ్లేవర్లతో సాఫ్ట్ డ్రింక్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. బిస్లరీ రేవ్ (కోలా ఫ్లేవర్), బిస్లరీ పాప్ (ఆరెంజ్), బిస్లరీ స్పైసీ జీరా డ్రింక్స్ ను ఆవిష్కరించింది. ఇప్పటికే ఉన్న లెమన్ కు తోడు కొత్త ఫ్లేవర్లతో యువతను ఆకట్టుకునేందుకు బిస్లరీ ప్రయత్నాలు చేస్తోంది. 160 ఎంఎల్, 600 ఎంఎల్ బాటిళ్లలో ఈ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. నూతన తరం వారి కోసం ఈ సరికొత్త డ్రింక్స్ తీసుకువచ్చినట్టు బిస్లరీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. బిస్లరీ ఇంటర్నేషనల్ వైస్ చైర్ పర్సన్ జయంతి చౌహాన్ స్పందిస్తూ, కొత్త రుచులను ఇష్టపడే యువతకు తమ సాఫ్ట్ డ్రింక్స్ నచ్చుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. తమ డ్రింక్స్ కు వెరైటీగా ఓటీటీ నటులతో ప్రచారం చేయిస్తున్నామని వెల్లడించారు. సబా ఆజాద్, అర్మాన్ రల్హన్, ఆషిమ్ గులాటీ తమ బ్రాండ్స్ కు ప్రచారకర్తలు అని పేర్కొన్నారు.