నవతెలంగాణ న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో సత్తా చాటేందుకు అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల 52మందితో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ అధిష్ఠానం శుక్రవారం మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసింది. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజవకర్గం నుంచి మిథున్ కుమార్ రెడ్డిని బరిలో దించుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక్క అభ్యర్థి పేరుతో రెండో జాబితాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు.