– ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనీ, నిరుద్యోగ భతిగా రూ.9,000 చెల్లిస్తామని హామీనిచ్చిన బీజేపీ నిరుద్యోగులను మోసం చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ లిబర్టీలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో యువజన విభాగం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ చెప్పిన అచ్ఛేదిన్ రానే రావనీ, నిరుద్యోగం, నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నిజాయితీ, ప్రత్యామ్నాయ రాజకీయాల ఆలోచనలను ఇంటింటికి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆప్ యువజన విభాగం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. సర్దార్ రణధీర్ సింగ్ రానా నూతన అధ్యక్షులుగా, ఆకుల సంతోష్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.