బీజేపీకి ఆ హక్కు లేదు : కేటీఆర్

నవతెలంగాణ హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడుతూ..”దేశాన్ని నిరుద్యోగ భారతంగా తయారు చేసిందే బీజేపీ. ఆ పార్టీకి అధ్యక్షులు కిషన్ రెడ్డికి నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆశచూపి మోడీ అధికారంలోకి వచ్చారు. మోడీ దేశంలోని యువతీ యువకులను మోసం చేశారు. పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసినన్ని ఉద్యోగాలను దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా భర్తీ చేసిందా కిషన్ రెడ్డి చెప్పాలని సవాల్. ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలెన్ని, ఆయా శాఖల వారీగా ఉన్న ఖాళీలెన్నో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా. పేపర్ లీకేజీకి పాల్పడింది మీ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడే. సహాయ మంత్రిగా కాకుండా.. నిస్సహాయ మంత్రిగా మారిపోయిన కిషన్ రెడ్డి వల్ల తెలంగాణ యువతకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తూ వారిని రాజకీయాలకు వాడుకునే కుట్రలకు ఇప్పటికైనా కిషన్ రెడ్డి ముగింపు పలికాలి.” అని మంత్రి కేటీఆర్ సూచించారు.

Spread the love