తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ : కాంగ్రెస్

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అంటూ హైదరాబాద్‌‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. తెలంగాణకు అడిగినవి… అంటూ అందులో వివరించారు. ‘తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఇది..’ అంటూ దీనిని ట్వీట్ చేసింది. రూపాయి పంపిస్తే 43 పైసల బిచ్చం నుంచి విముక్తి, మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా, కనీసం ఒక్క ఐఐఎం, ఎన్ఐడీ విద్యాలయం, కనీసం ఒక్క ఐఐఎం, మెడికల్ కాలేజీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకుకు జాతీయ హోదా, బడ్జెట్‌లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా, 811 టీఎంసీ కృష్ణా జలాల్లో సరైన వాటా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్ అడిగినట్లు ఆ ఫ్లెక్సీలో వివరించారు. అయితే బీజేపీ ఇచ్చింది మాత్రం ‘గాడిద గుడ్డు’ అంటూ ఓ గుడ్డు గుర్తును కూడా అక్కడ ఏర్పాటు చేసింది.

Spread the love