చంద్ర గ్రహాన్ని వదలని భాజపా..

– భారత లౌకిక విధానానికి తూట్లు…
– సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట: భారత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వినియోగించి ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో మేధస్సు ను ఉపయోగించి,ఎన్నో పరిశోధనలు చేసి చంద్ర గ్రహం పై కి ల్యాండర్ పంపి,రోవర్ తో పరిశోధనలు చేస్తుంటే ఇలాంటి శాస్త్రీయ చారిత్రక ఘట్టాన్ని సైతం నరేంద్రమోడీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో మత రాజకీయం చేసి ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పేరుతో నామకరణం చేయడం భారతీయ లౌకిక విధానాలకు తూట్లు పొడవడమేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేసారు. మండల కమిటీ సభ్యులు ముళ్ళగిరి గంగరాజు అద్యక్షతన సోమవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ప్రస్తుతం దేశంలో  మత రాజకీయాలను ఉదృతం చేసి అధికారం చేజిక్కించుకోవడానికి చూస్తున్న నరేంద్రమోడీ చంద్ర మండలాన్ని సైతం రాజకీయంతో కలుషితం చేయడానికి వెనుక ఆడటం లేదని వాపోయారు. అనంతరం విద్యుత్ పోరాటంలో అమరుల గౌరవార్ధం బషీర్ బాగ్ డే నిర్వహించారు.ఈ సందర్భంగా అమర వీలరు చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్,మండల కార్యదర్శి బి.జిరంజీవి, తగరం జగన్నాధం, గడ్డం సత్యనారాయణ, కలపాల భద్రం, మడకం గోవిందరావు, తగరం నిర్మల లు పాల్గొన్నారు.
Spread the love