కులగణనతో ఇరకాటంలో బీజేపీ

BJP in trouble with caste census– దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇండియా కూటమి బలం
– కులవ్యవస్థను కొనసాగించడమే సనాతన ధర్మం
– కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలతో డిఫెన్స్‌లో కేసీఆర్‌ : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం. బీసీల లెక్క తీస్తామంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించడంతో బీజేపీ ఇరకాటంలో పడింది’అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన సమస్య తీవ్రంగా ఉందన్నారు. బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం కులగణన చేసి బీసీల లెక్కను తేల్చిందని గుర్తు చేశారు. అయితే
కులగణన చేసి హిందూమతాన్ని చీల్చుతున్నా రంటూ బీజేపీ కొత్తపాట పాడుతున్నదని విమర్శిం చారు. నవతెలంగాణ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో లబ్దిపొందడం కోసమే మహిళా బిల్లును ఆమోదించారని చెప్పారు. అయితే మహిళలపై నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఎన్నికల నుంచే అమలు చేసేదని అన్నారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలు చేస్తామని చెప్పడం మహిళలను మభ్యపెట్టడ మేననీ, ఇదంతా ఓట్ల కోసమేనని విమర్శించారు. అందులో బీసీ మహిళలకు రిజర్వేషన్‌ కల్పించ లేదన్నారు. దీంతో మహిళా బిల్లును ఆమోదించినా బీజేపీపై వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. పార్ల మెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఐక్యం చేస్తామన్నారు. హిందూత్వ రాజ్యాన్ని స్థాపించడమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యమని వివ రించారు. అయితే హిందూత్వ రాజ్యం తెచ్చేందుకు రాజ్యాంగం అడ్డుగా ఉందంటూ గోల్వాల్కర్‌ సిద్ధాంతగ్రంథంలో రాశారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని బీజేపీ భావిస్తున్నదని చెప్పారు. అందుకే సనాతన ధర్మాన్ని నాశనం చేయకుండా దేశం ముందుకుపోదంటూ ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యా నించారని గుర్తు చేశారు. సనాతన ధర్మమంటే మనుధర్మాన్ని అమలు చేయడమేనని అన్నారు. కులవ్యవస్థను యథావిధిగా కొనసాగించడమే సనా తన ధర్మమని వివరించారు. కులవ్యవస్థ పోవాలనీ, సమానత్వం రావాలని అభ్యుదయ వాదులు కోరుకుంటున్నారని చెప్పారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్‌ అనుకూల విధానాలు, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, అందరికీ ఇండ్లు, అన్ని రాష్ట్రాల్లో బుల్లెట్‌ రైళ్లు వస్తాయన్న బీజేపీ హామీలు చర్చకు వస్తే ప్రజలు ఆ పార్టీకి ఓట్లే యబోరని అన్నారు. ఇంకోవైపు ఇండియా కూటమి బలం దేశవ్యాప్తంగా పెరుగుతున్నదని వివరించారు. అందుకే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, విద్వేషాలను పెంచి, ప్రజల్లో భ్రమలను కల్పించడం పైనే మోడీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని వివరించారు. మత ఉద్రిక్తతలను రెచ్చగొడితేనే బీజేపీ బలపడుతుం దన్నారు. రాష్ట్రంలో వామపక్షాలకు బీఆర్‌ఎస్‌ మిత్ర ద్రోహం చేసిందని విమర్శించారు. వారి రాజకీయ వైఖరిలో మార్పు రావడం వల్లే సీపీఐ, సీపీఐ(ఎం)కు బీఆర్‌ఎస్‌ దూరమైందని చెప్పారు. ఇండియా కూటమిలో వామపక్షాలుండడం కేసీఆర్‌కు ఇష్టం లేదంటూ, కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్‌ఎస్‌ మద్దతుతోనే అంటూ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. బీజేపీకి దగ్గరయ్యే ఈ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దేశంలో ప్రాంతీయ పార్టీలకు స్థిరమైన సిద్ధాంత ప్రాతిపదిక ఉండబోదనీ, వారి అవసరా లను బట్టి రాజకీయ నిర్ణయాలుం టాయని వివరిం చారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలతో కేసీఆర్‌ ఢిపెన్స్‌ లో పడ్డారని చెప్పారు. రైతుబంధు కౌలురైతులతో పాటు వ్యవసాయ కార్మికులు, కూలీలకూ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిందన్నారు. ఇంకోవైపు నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ల వయస్సును 58 ఏండ్లకు తగ్గిస్తామన్న బీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలకు అతీగతీ లేదన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తక్కువ సీట్లొస్తే ఎంఐఎం, బీజేపీ సహకారం కోరే అవకాశముందన్నారు. ఇది లోపాయికారిగా జరుగు తున్నదనీ, బహిరంగంగా ప్రకటిస్తే ముస్లింల ఓట్లు బీఆర్‌ఎస్‌ కోల్పోయే ప్రమాదముందంటూ జాగ్రత్త పడుతున్నారని చెప్పారు. నవతెలంగాణ హైదరా బాద్‌ రీజియన్‌ మేనేజర్‌ లింగారెడ్డి అధ్యక్షతన నిర్వ హించిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, నవతెలంగాణ సీజీఎం పి ప్రభాకర్‌, ఎడిటర్‌ ఆర్‌ సుధాభాస్కర్‌, న్యూస్‌ ఎడిటర్‌ రాంపల్లి రమేశ్‌, మొఫషీల్‌ ఇన్‌చార్జీ వేణుమాధవ్‌, జనరల్‌ మేనేజర్లు భరత్‌, రఘు, వెంకటేశ్‌, ఆర్‌ వాసు, శశిధర్‌, నరేందర్‌రెడ్డి, పవన్‌, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love