నవతెలంగాణ- హైదరాబాద్: శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు బీజేపీ చేపడుతుంది. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయింకుంది. బీజేపీ దరఖాస్తులను ఆహ్వానించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులను తీసుకోనుంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నేతృత్వంలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ నెలాఖరుకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిసింది.