
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ,బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి వరించడంపై మండల జీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.అదివారం డీల్లిలో కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ బండి సంజయ్,కిషన్ రెడ్డిని బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్నానించారు. కరీంనగర్ ఎంపీగా రెండవ సారీ ఎన్నికై కేంద్ర మంత్రి పదవివరించడం అనందనీయమని మహిపాల్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
బీజేపీ శ్రేణుల సంబురాలు..
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా అదివారం మండల బీజేపీ శ్రేణులు మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద టపాసుల కాల్చి సంబురాలు జరుపుకున్నారు.