మహిళా రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధిలేదు

– సునీతారావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మహిళా రిజర్వేషన్లను అమలు చేయడంలో మోడీ సర్కారుకు, బీజేపీకి చిత్తశుద్ధి లేదని మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు సునీతారావు విమర్శించారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళా ఓటర్ల శాతమే ఎక్కువ కాబట్టి మహిళా లోకాన్ని మభ్య పెట్టడానికి మోడీ నాటకమాడుతున్నారని చెప్పారు. ఇది బీజేపీ ఎన్నికల జిమ్మిక్కు అని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాసైనా అమలు చేయడానికి జనాభా గణన అవసరమన్నారు. ఈ విషయం తెలిసి కూడా జనాభా గణన చేపట్టకుండా మహిళా రిజర్వేషన్‌ బిల్లు అనే పేరుతో కొత్త నాటకానికి మోడీ తెర లేపారని విమర్శించారు.

Spread the love