ఎంపీలకు బీజేపీ త్రీ లైన్ విప్ జారీ..

vamsa-tilak-is-the-cantonment-bjp-candidateనవతెలంగాణ-హైదరాబాద్ : రేపు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉండటంతో పార్టీ ఎంపీలందరూ తప్పక హాజరుకావాలని బీజేపీ త్రీ లైన్ విప్ జారీ చేసింది. కాగా ఎన్డీఏ నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కె.సురేశ్ స్పీకర్ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేశారు. రేపు స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. మరోవైపు వైసీపీ ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Spread the love