పొంగులేటితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ

నవతెలంగాణ- ఖమ్మం: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డిని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దీంతో రాజగోపాల్ సొంతగూటికి చేరబోతున్నారా అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కమలం పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి హస్తం గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది.

Spread the love