బీజేపీ ఎంపీకి రెండేండ్లు జైలు

BJP MP jailed for two years– శిక్ష విధించిన ఆగ్రా కోర్టు
ఆగ్రా : 2011లో విద్యుత్‌ సరఫరా సంస్థ ఉద్యోగులపై దాడి కేసులో బీజేపీ లోక్‌సభ సభ్యుడు రామ్‌ శంకర్‌ కతేరియాకు ఆగ్రా కోర్టు రెండేండ్లు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఆగ్రాలోని ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్‌ శనివారం తీర్పు వెలువరించారు. 2011లో టోరెంట్‌ పవర్‌ కంపెనీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని, ఉద్యోగులను కొట్టారన్న కేసులో కతేరియా నిందితులుగా ఉన్నారు. కతేరియా 2014 నవంబర్‌ నుండి 2016 జులై వరకు కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఎస్‌సీ/ ఎస్‌టీ కమిషన్‌ చైర్మెన్‌గానూ వ్యవహరించారు. ఆయనపై 12 నేరారోపణ కేసులు ఉన్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం, రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు శిక్ష విధించబడిన ఎన్నికైన ప్రజా ప్రతినిధిపై అనర్హత పడే అవకాశం ఉంది. ఇటీవల పరువునష్టం కేసులో రెండేండ్లు జైలుశిక్ష పడటంతో రాహుల్‌గాంధీపై లోక్‌సభ స్పీకర్‌ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్‌ విషయంలో వేగంగా స్పందించిన కేంద్రం ఇప్పుడెలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.

Spread the love