– ప్రజాసంఘాల అధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ – భువనగిరి
భారత రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీకన బ్రిజ్ భూషణ్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, వ్యకాస, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వ్యకాస జిల్లా కార్యదర్శి కొండమడుగు నర్సింహ, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన రెజ్లర్ల పై లైంగిక దాడి చేసి అనేక మంది రెజ్లర్ల పై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ,రేజ్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరత్‌సింగ్‌ని అరెస్ట్ చేసి, కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో,ఒలంపిక్స్ క్రీడలలో దేశానికి పథకాలు తీసుకువచ్చి దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిత బీజేపీ ఎంపీ ఆ క్రీడాకారులపై లైంగిక దాడికి పాల్పడి దేశ ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేశారని విమర్శించారు. భేటీ బచావో భేటీ పడావో అంటూ నినాదాలు చెప్పే మోడీ,నిత్య దేశ భక్తి గురించి మాట్లాడే బిజెపి నాయకులు ఎందుకు నోరుమెడపడం లేదని ప్రశ్నించారు.వినేష్ పోగాట్, బజ్రంగ్ పునియా, సాక్షి మాలిక్ లాంటి రేజ్లర్లు చేస్తున్న పోరాటానికి యావత్ దేశం అండగా ఉందని, ప్రజా సంఘాల మద్దత్తు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దాసరి పాండు,కల్లూరి మల్లేశం , జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అద్యక్ష,కార్యదర్శులు ఈర్ల రాహుల్,చింతల శివ , ఎన్‌పీఆర్‌డీ జిల్లా నాయకురాలు లలిత, నాయకులు బందెల ఎల్లయ్య, వల్దాస్ అంజయ్య, కొండాపురం యాదయ్య, ఈర్లపల్లి నర్సమ్మ పాల్గొన్నారు.