గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు బిజెపి మద్దతు..

నవతెలంగాణ -గోవిందరావుపేట

గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు బిజెపి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని బిజెపి మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె రెండవ రోజు  తేజ రాజు సమ్మెను ప్రారంభించి మద్దతు తెలిపి మాట్లాడారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా వంటి సమయంలో కూడా ప్రజల ప్రాణాలను కాపాడారని అన్నారు. అటువంటి వారి సేవలను ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పంచాయతీ కార్మికులను సన్మానించడం కాదు వారి దుర్భర జీవితాలను గుర్తించి  రెగ్యులర్ చేయడంతో పాటు కనీస వేతన చట్టం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి,  దేవేందర్రావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love