నల్గొండ జిల్లాలోనే 2024 బీజేపీ సభ్యత్వ నమోదు లో చండూర్ మున్సిపాలిటీ ముందంజలో ఉన్నందుకు గాను చండూరు మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ ను ఆ పార్టీ తెలంగాణ ఇన్చార్జి, కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పాటిల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సత్యం గౌడ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వం నమోదు పెంచేందుకు దిశగా ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్శిత్ రెడ్డి,కిసాన్ మోర్చ జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి,రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్,జిల్లా సభ్యత్వ ప్రముఖ్ విద్య సాగర్ రెడ్డి,ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు పొతపాక సాంబయ్య,అసెంబ్లీ కో కన్వీనర్ కాశాల జనార్దన్ రెడ్డి,మండల అధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.