రాజ్యాంగాన్ని మార్చే బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి

– భారత్‌ జోడో అభియాన్‌ రంగారెడ్డి జిల్లా కమిటీ పిలుపు
– కడ్తాల్‌ మండలం సాలార్‌పూర్‌లో ప్రచారం ప్రారంభం
నవతెలంగాణ-ఆమనగల్‌
ప్రజలందరికీ స్వేచ్చ, సమానత్వం, సోదరభావం, సామాజిక ఆర్ధిక, రాజకీయ న్యాయన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని మార్చే శక్తుల కుట్రలను ఓటు అయుధంతో తిప్పికొట్టాలని భారత్‌ జోడో అభియాన్‌ రంగారెడ్డి జిల్లా నాయకులు గండు నర్సింహ్మ, దళిత బహుజన శ్రామిక యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము తిరుపతి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, డీబీఎస్‌యూ జిల్లా కార్యదర్శి జోగు రమేష్‌, మహేశ్వరం అసెంబ్లీ ఇన్‌చార్జిలు కావలి రాములు, కె.స్వప్న తదితరులు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రచారోద్యమాన్ని రంగారెడ్డి జిల్లా సాలార్‌ పూర్‌ గ్రామంలో నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు అణగారిన వర్గాల జీవితాలకు చదువు అనే అయుధాన్ని ఇచ్చి బ్రహ్మణీయ దోపిడీ నుంచి పూలే కాపాడారని గుర్తు చేశారు. తొలి సామాజిక విప్లవ కారుడు పూలే అని తెలిపారు. పూలే రాసిన గులాంగిరి తదితర పుస్తకాలను అధ్యయనం చేసి తన పొరాటాలను ఆదర్శం చేసుకుని, తన గురువుగా ప్రకటించుకున్న డాక్టర్‌ అంబేద్కర్‌ భారత రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని పదె పదె ప్రకటిస్తున్న కేంద్ర మంత్రుల కుట్రలను అర్థం చేసుకుని, రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని సూచించారు. ఈ ప్రచార కార్యక్రమం చేవెళ్ల, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, సికింద్రాబాద్‌ తదితర పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భారత్‌ జోడో అభియాన్‌ రంగారెడ్డి జిల్లా నాయకులు చెవిటి మల్లేష్‌, టీ.శంకర్‌, కావలి అంజయ్య, కర్రె కృపయ్య, నేనావత్‌ పత్య, పడకంటి నాగేష్‌, కావలి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love