ఇంటింటికి బీజేపీ సంక్షేమ పథకాలు…

నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రతి ఇంటికి బిజెపి సంక్షేమ పథకాలు ఎలా వర్తిస్తున్నాయో విషాదీకరిస్తున్నారు బిజెపి నాయకులు. సోమవారం మండలంలోని పసర నాగారం గ్రామంలో 71 72 బూత్ నెంబర్లలో సమిష్టిగా ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి మోడీ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలు మరియు విదేశాలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ  ఔన్నత్యము ,భారతదేశం యొక్క గౌరవము, పెరిగింది . భారత దేశంలో రామరాజ్యము స్థాపనకే అవినీతి రహిత ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ  అందిస్తున్నారని ,వివిధ సంక్షేమ పథకాలను ప్రజలలో గ్రామాన,,గ్రామాన  జాతీయ ఉపాధి హామీ పథకం కింద సిసి రోడ్లు, తదితర సంక్షేమ పథకాలు అన్నిటిని  బిజెపి ప్రభుత్వం చేస్తుందని కార్యకర్తలు ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మెరుగు సత్యనారాయణ, భూత్ అధ్యక్షులు యార్లగడ్డ నాగేశ్వరరావు ,మద్దినేని తేజ రాజు , కొత్త సుధాకర్ రెడ్డి, కొమరపాలెం ధర్మారావు, బైరి మహిపాల్ రెడ్డి, మండల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love