నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్లో పేలుడు సంభవించింది. సాయినగర్ కాలనీలోని ఓ హోటల్లో సిలిండర్ పేలిపోయింది. సిలిండర్ పేలుడు ధాటికి మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో హోటల్ పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని హోటల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో యజమాని, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.