ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా

– తెలంగాణలో అధికారంలోకి రానున్నది కాంగ్రెస్‌ పార్టీ
– ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుంది
– టీపీసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్‌ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్‌ మేడిపల్లి సత్యం
నవతెలంగాణ – రామడుగు : ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని కాంగ్రెస్‌ చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం అన్నారు. ఈ మేరకు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా మండలంలోని దేశరాజుపల్లి గ్రామంలో గడపగడపకు తిర్నుతూ ఆశీర్వదించాలని వేడుకున్నారు. 2004 ఆనాటి కాంగ్రెస్‌ దివంగత స్వర్గీయ రాజశేఖర్‌ రెడ్డి108 సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్‌, పెన్షన్‌, రుణమాఫీ, లాంటి ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పథకాలనే కాపీ కొట్టి తనవిగా ప్రచారం చేసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు,దళితులకు మూడెకరాల భూమి, పేదలకు ఇండ్ల స్థలాలు, ఏకకాలంలో రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను సీఎం కేసీఆర్‌ మర్చిపోయారని విమర్శించారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్‌ నిలిచాడని ఎద్దేవా చేశారు. గెలిచిన నాలుగేళ్లలోనే వందల కోట్లు అక్రమంగా సంపాదించి తెలంగాణలోనే నెంబర్‌ వన్‌ అవినీతి ఎమ్మెల్యేగా పేరు పొందాడనన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన పథకాలను అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బొమ్మరవెణి తిరుపతి, దేశరాజ్‌ పల్లి గ్రామ సర్పంచ్‌ కొల రమేష్‌, బండ శకుంతల, వన్నారం ఎంపీటీసీ సభ్యుడు జవ్వాజి హరీష్‌,పంజాల శ్రీనివాస్‌, కాడే శంకర్‌, కంకణాల శ్రీనివాస్‌, మాడుగుల రత్నాకర్‌ రెడ్డి, కంకణాల రాజు, మడుపు వేణు,ఎడమ అశోక్‌ రెడ్డి, జక్కుల బాబు,బండారి మధు,కట్ల శంకర్‌, లక్ష్మణ్‌, సుధీర్‌, వంశీ, సంతోష్‌, సహు ఉదరు, పొన్నం కనకయ్య, అజరు పాల్గొన్నారు.

Spread the love