ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా

– తాండూరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూర్‌ రూరల్‌
కారు గుర్తుకు ఓటేసి మరో మారు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అ భ్యర్థి రోహిత్‌ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండలం నారాయణపూర్‌, గోనూర్‌, వీరుశెట్టిపల్లి, బిజ్వార్‌, ఖాంజాపూర్‌, అంతారం, అంతారం తండా. చెంగేస్‌పూర్‌, ఎల్మకన్న, గ్రామాల్లో ఎన్నికల ప్రచారా న్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్‌ రెడ్డి మా ట్లాడుతూ…మరో మారు కారు గుర్తుకు ఓ టు వేసి ఆశీర్వదిస్తే తాండూరు అభివృద్ధిని చేసి చూపిస్తాన న్నారు. 2 ఏండ్లలోనే తాండూరు అభివృ ద్ధికి రూ.16 వేల 84 లక్షల కోట్లు మంజూరు చేయించామన్నా రు. తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమ వుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి ‘నన్ను ఆశీర్వదించినట్లయితే సీఎం కేసీఆర్‌ సీఎం అవుతారని’ అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మం జుల వెంకటేశం, వాయిస్‌ ఎంపీపీ స్వరూప వెంకట్‌ రామ్‌ రెడ్డి, సర్పంచులు చంద్రప్ప, గోవింద్‌, నాగప్ప, నరేందర్‌ రెడ్డి, లలిత, సావిత్రిబాయి, రామమ్మ, నా గమణి, రైతుబంధు మండల కోఆర్డినేటర్‌ రామలిం గారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఉమాశంకర్‌, మండల ప్రధాన కార్యదర్శి రాకేష్‌గౌడ్‌, చెంగేస్పూర్‌ హనుమాన్‌ దేవాలయ చైర్మన్‌ ప్రశాంత్‌ గౌడ్‌, గౌత పూర్‌ సర్పంచ్‌ రాజప్ప గౌడ్‌, సర్పంచ్ల సంఘం మం డలాధ్యక్షులు.రాములు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love