పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి: మంత్రి హరీశ్ రావు

– ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ మాయ మాటలు నమ్మొద్దు
నవతెలంగాణ – సిద్దిపేట
ఎన్నికలు సమీపిస్తే కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు రంగురంగుల మాటలు చెప్తారు. వారిని నమ్మొద్ద, వారి మాటలు నమ్మొద్దు, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరి పెళ్లికైనా రూ.10 వేల ఆర్థిక  సహాయం చేశారా, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి అని  రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి  హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మంది పెళ్లిలకు హార్థిక సాయం అందజేశామని, సద్దితిన్న రేవు తలవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆశీర్వదించాలని మంత్రి హరీశ్ రావు కోరారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట రూరల్-37, చిన్నకోడూర్-42, నంగునూరు-41, నారాయణరావుపేట-33 మొత్తం 153 మందికి సీఎంఆర్ఎఫ్, నంగునూరు మండలానికి చెందిన 49 మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకం యావత్ ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love