
నవతెలంగాణ – కంటేశ్వర్
బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో గద్దెదించాలని బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు వల్లెపు ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి గృహంలో బిఎల్ఎఫ్ నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధిపత్య కార్పోరేట్ ఆర్థిక విధానాల వల్ల దేశంలో రైతులు, కార్మికులు మహిళలు విద్యార్థులు, ఆదివాసీలు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న బీజేపీ ఫాసిస్టు శక్తులను ప్రతిఘటించాలంటే బహుజన వామపక్ష పార్టీలు ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ మాట్లాడుతూ వామపక్ష పార్టీలు కాంగ్రెస్ బీజేపీ లకు ప్రత్యామ్నాయం నిర్మించకుండా కాంగ్రెస్ పంచన చేరితే , బిఎస్పీ చెప్పేది బహుజన సిద్ధాంతం ఆరారణ ఆధిపత్య కులాల యాజమాన్యంలోని బీఆర్ఎస్ పంచన చేరడం ద్వారా బహుజన శ్రామిక వర్గానికి అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయం రాజకీయాల కోసం ప్రజలు ఉద్యమించాలని పిలుపునిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ వనం సుధాకర్, రాష్ట్ర నాయకులు ఎస్. సిద్దిరాములు, సబ్బని లత, మేత్రి రాజశేఖర్,కె.మధు. వడ్లు సాయి కృష్ణ, కె.నగేష్ ,జిల్లా నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్, బ్రాహ్మణపల్లి జగదీష్ టి.రాజు తదితరులు పాల్గొన్నారు.